Followers

కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని


కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలని..


ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ని పెంచాలని..


మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్..


మండపేట,పెన్ పవర్ 


కరోనా నియంత్రణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకునే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరోనా పాజిటివ్ వచ్చిన వారి విషయంలో చూపించటం లేదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృబిస్తోన్న కీలక సమయంలో ప్రైమరీ కాంటాక్ట్ లకు కరోనా పరీక్షలు జరపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని ఆరోపించారు. సమయానికి కరోనా పరీక్షలు చేయకపోవడంలో ప్రజలు మానసికంగా తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారన్నారు. కరోనా కేసులు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను పెంచాలన్నారు. ఇక్కడ నుండి డిప్యుటేషన్ పై వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలన్నారు. కోవిడ్ 19 పై అధికారులు తమ సామర్ధ్యానికి మించి సేవలు చేస్తున్నారని, కాకపోతే ప్రభుత్వం నుండి వారికి సరైన సహకారం అందడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ప్రజలు ధైర్యంగా వుంటూ కరోనాను జయించాలని కోరారు. స్వీయ నియంత్రణ చాలా అవసరమన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...