ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వాడబలిజ సంఘం నాయకులు
వి.ఆర్.పురం పెన్ పవర్:
వి.ఆర్.పురం మండలం రేఖపల్లి గ్రామంలో వాడబలిజ సంఘం సమావేశం డా.నాగేంద్రబాబు ఇంటి వద్ద మనిషికి మనిషికి దూరం పాటిస్తూ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వాడబలిజ సంఘం డివిజన్ అధ్యక్షుడు డా.నాగేంద్రబాబు మాట్లాడుతూ మన రాష్ట్రంలో పేద బలహీన వర్గాల ప్రజల ఆశయాల కొరకు పోరాడే వ్యక్తి సిదిరి అప్పలరాజుకు రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి పదవి ఇచ్చిన మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వి.ఆర్.పురం వాడబలిజ సంఘం వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెర్రబోయిన రమణ, నెర్రబోయిన శ్రీను, దానబోయిన వెంకన్న, ముత్తిబోయిన సాయి, గగ్గురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment