ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి
గోకవరం పెన్ పవర్.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అన్నారు. మండలంలోనే గోకవరం గ్రామంలో బుధవారం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం లో హెచ్పిసిఎల్ ఆయిల్ ప్లాంట్ టెర్మినల్ సౌజన్యంతో 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన డిజిటల్ ఎక్స్ రే మిషన్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన 104 మొబైల్ వైద్య సౌకర్యాలు వాహనాన్ని ఎమ్మెల్యే చంటిబాబు ప్రారంభించారు. అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 జయంతి సందర్భంగా గోకవరం పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చంటి బాబు ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని తంటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ హెచ్ ఆర్ వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే చంటి బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సూరారెడ్డి,వరసాల. ప్రసాద్, జానప రెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, చింతల్ అనిల్ కుమార్, నరాల శెట్టి నరసయ్య, సుంకర వెంకటరమణ, సమ్మేటి. నాని, బద్ది రెడ్డి రెడ్డయ్య, సుంకర వీరబాబు, కొల్లాటి రామకృష్ణ, గోల్లా ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment