రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రైతు దినోత్సవ వేడుకలు
పరవాడ, పెన్ పవర్
పరవాడ మండలం:మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి సందర్భంగా మండలం లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతు దినోత్సవ వేడుకలగా ఘనంగా నిర్వహించిన అధికారులు.మండల కెద్రం లోని రైతు భరోసా కేద్రంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించి రైతు లను ఘనంగా సన్మానించి సత్కకరించారు. అనంతరం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వైఎస్సార్ రైతు భరోసా-పి.ఎమ్ కిసాన్,వైఎస్సార్ ఉచిత పంట భీమా,రైతు ల వద్దకే రాయితీ విత్తనాల పంపిణీ,వైఎస్సార్ పొలంబడి,0 వడ్డీకే పంట రుణాలు,ఉచిత బోర్ లు,ఉచిత విద్యుత్,వైఎస్సార్ పశునష్ట పరిహారం,ఇలా రైతు లకు అందిచే సదుపాయాలను వివరించారు.సేంద్రియ వ్యవసాయం మరియు విత్తన శుద్ధి గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి టి.శ్రీదేవి,మండల వ్యవసాయ శాఖ అధికారిణి చంద్రావతి,పశుసంవర్దక శాఖ ఎడి డాక్టర్ రామకృష్ణ కీర్తి,వైసిపి రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా పార్టీ కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,పెందుర్తి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జూనియర్ అప్పలనాయుడు,బండారు రామారావు,కోన రామారావు,రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment