Followers

ఏజెన్సీలో వైద్యులు డెంగ్యూ డ్రై డే గా పాటించాలి


 


ఏజెన్సీలో వైద్యులు డెంగ్యూ డ్రై డే గా పాటించాలి.



  ఐటిడిఓ పిఓ వెంకటేశ్వర సలిజామల



విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



 ఏజెన్సీలో వైద్యాధికారులు డెంగ్యూ డ్రై డే గా పాటించాలని  పాడేరు ఐ టి డి ఎ పివో  వెంకటేశ్వర్ సలిజామల అన్నారు. సోమవారం ఐ టి డి ఎ కార్యాలయం  11 మండలాల వైద్య అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న  నేపద్యంలో డెంగ్యూ వ్యాధి విజృంభించే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎపిడిమిక్  కావటంవల్ల వైద్యాధికారులు ఏజెన్సీ లో పీహెచ్సీల పరిధిలో అందుబాటులో ఉండాలని కోరారు. విధులకు  గైర్హాజర్ అయితే  చర్యలు తప్పవన్నారు. డెంగ్యూ కేసులు  నమోదు కాకుండా  హ్యాపీ హెచ్ ఎ లా పరిధిలో చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సిబ్బందిని కూడా అప్రమత్తం చేయాలని కోరారు.రక్త పూతల నమూనా ల సేకరణ లో యు. చీడిపాలెం మినుములూరు కిలగాడ సప్పర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు వెనుక బడి ఉన్నాయ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాకినాడ నుంచి వీడియో కాన్ప రెన్స్ కు హాజరైన యు చీడిపాలం వైద్యుడు సురేష్ కు సోకాజ్ నోటి స్ జారీ చేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...