Followers

ప్రత్యేక పరిపాలనాధికారి. ఎక్కడ వుంటారో..!  ఎలావుంటారో..!


ప్రత్యేక పరిపాలనాదికారి. ఎక్కడ వుంటారో..?  ఎలావుంటారో..?


జీకే వీధిలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఉత్సాహం


 గూడెం కోత్త వీధి,  పెన్‌ పవర్‌


విశాఖ ఏజెన్సీ. విశాఖ జిల్లా గూడెం కోత్త వీధిమండలంలోని. విదులు నిర్వహించడానికి  అధికారులు క్యూ కడుతున్నారు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడంతో అధికార పార్టీకీ చెందిన మండల  స్థాయి నాయకులు చక్రం తిప్పుతున్నారని విమర్శులు గుప్పుమంటున్నాయి.  ఎన్నడూ లేని విధంగా మండలంలో   ఎం. డి. ఒ. తహశీల్దార్‌. ఇద్దరు గతనెల  30వ తేదీన పదవి విరమణ చేసిన విషయం తెలిసిందే. పాడేరు ఎమ్యేల్యే, అరుకు ఎంపీల పేర్లు వినియోగించుకుంటున్న నాయకులు చుట్టూ అధికారులు. క్యూ కడుతున్నారనే విమర్శలు  వినిపిస్తున్నాయి. నిధులు పుష్కలంగా ఉండటంతో అటు ఎం. డి. ఒ. పోస్ట్లు. ఖాళీగా వుండడంతో ఆక్కడ పోస్టింగ్‌ కు మంచి గిరాకీ పెరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఒక్క అధికారికి కొంతమంది అధికారపార్టీ నాయకులు లోకల్‌ గా ఉన్న మరి కొంతమంది ప్రముఖులు పలుకుబడి వినియోగించుకుని, సుమారు రెండు నుండి ఐదు లక్షలు చెల్లించి. ఎండీఓ పొస్టు ను సంపాదించుకుంటున్నట్లు ప్రజా సంఘాలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు..? ఇప్పటికే గూడెం కోత్త వీధి మండలం లో బాతురూముల  నిర్మాణాల లో ల క్షలాది రూపాయలు అవినీతి జరిగిందని, దినిపై సమాగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రజా సంఘాలు డిమాండ్లు చేస్తూన్నాయి. అయినా సంబంధిత జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు. వ్యవహరిస్తున్నరన్నధి     జగమెరిగిన సత్యం... ప్రతి పంచాయితీ సర్పంచ్‌ పాలన  ముగిసిన తరువాత. ప్రభుత్వం ప్రతి పంచాయితీకి. ప్రత్యేక పరిపాలనాధికారిని నియమించిన విషయం తెలిసిందే. ఇటువంటి కొంత మంది అధికారులు విధులకు రాకుండా... పంచాయతీ కార్యదర్శులతో కుమ్మక్కు అయ్యి, జీతాలు తీసుకుంటూ సొంతపనులు చేసుకుంటున్న విషయం బహిరంగ. రహస్యమే. మండలం లో మేజర్‌ పంచాయతీ అయిన గూడెం కోత్త వీధి ప్రత్యేక పరిపాలనాదికారి. ఎక్కడ వుంటారో..?  ఎలావుంటారో..? ఎవ్వరికీ తెలియని మిలియన్‌ డాలర్ల ప్రశ్న..!. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించి ఎంతమేరకు ఈ నిధులు వినియోగిస్తున్నారనే విషయం పై సమగ్ర దర్యాప్తు చేయాల ని మండల ప్రజలు కోరుతున్నారు..


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...