అనకాపల్లి లో మరో కోవిడ్ కేర్ సెంటర్
-- పార్లమెంట్ పరిశీలకులు రత్నాకర్
అనకాపల్లి , పెన్ పవర్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్ లు పెరిగాయని పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి మండలం లో రేపాక గ్రామంలో పాలిటెక్నిక్ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే అమర్ సూచనల మేరకు 300 పడకల ఏర్పాటు చేసి దానికి తగిన వైద్య సిబ్బంది కిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తుండగా కోవిడ్ కేర్ సెంటర్ ను కూడా ఈ రోజు నుంచే ఉపయోగించినునట్లు తెలిపారు. వ్యాధి సీరియస్ అయితే విశాఖపట్నం తరలించడం జరుగుతుందన్నారు. వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ సామాజిక దూరం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలన్నారు.
No comments:
Post a Comment