Followers

ప్రమాదానికి బాద్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలి



ప్రమాదానికి బాద్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలి

 

       జనసేన శివసెంకర్

 

             పరవాడ పెన్ పవర్

 

రామ్ కి ఫార్మాసిటీ లో విశాఖ సాల్వెంట్ కంపెనీ లో రాత్రి 10:30 కు  జరిగిన ప్రమాద విషయం తెలుసుకుని జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిన శివశంకర్ మరియు రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య  కంపెనీని ప్రమాద స్థలాన్ని పర్యటించారు.శివశంకర్ మాట్లాడుతూ గతంలో ఈ ఫార్మా కంపెనీలన్నీ సేఫ్టీ ఆడిట్ చేయించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గతంలో తాడి గ్రామం పర్యటించినప్పుడు డిమాండ్ చేశారని అన్నారు.ఫార్మా కంపెనీలు అన్నీ పీసీబీ యెక్క మెజర్స్ ఫాలో అవ్వాలని తరచూ ఈ ఫార్మాసిటీ కంపెనీ లో ప్రమాదాలు జరుగుతున్నాయని అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కార్మికుల ప్రణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం లేదని అలాగే ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, నష్టపోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని,చనిపోయిన కార్మికులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిర్వాసిత గ్రామాలు అయిన చుట్టుపక్కల గ్రామాలను ఇచ్చిన మాట ప్రకారం తరలించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మోటూరు సన్యాసినాయుడు.దుళ్ళ రామునాయుడు .79 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి  కిoతాడ ఈశ్వరరావు . జనసేన పార్టీ నాయకులు,పిల్ల  శివ కృష్ణ,బోద్దపు శ్రీనివాసరావు,సర్వసిద్ధి సన్యాసిరాజు, దాసర త్రినాథ్,జన సైనికులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...