నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట
జగ్గంపేట సి ఐ .సురేష్ బాబు హెచ్చరించారు. రోజురోజుకు కరోనా కేసులు మండల పరిధిలో పెరిగిపోవడంతో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. జగ్గంపేట లో లాక్ డౌన్ కారణంగా అత్యవసర సరుకులు సంబంధించిన దుకాణాలు మాత్రమే 6 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేస్తాయి. సమయం దాటిన తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదని తప్పనిసరి వచ్చినవారు నిబంధనలు పాటించాలి అన్నారు. అదేవిధంగా మోటార్ సైకిల్ పై ఒక్కరే వెళ్ళాలని ఇద్దరు వెళ్ళకూడదని హెచ్చరించారు. జగ్గంపేట మండల పరిధిలో కరుణ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జగ్గంపేట మండల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అందరూ నిబంధనలు పాటిస్తే మీకే కాకుండా మీ కుటుంబాలకు కూడా శ్రేయస్కరం. పోలీసులను చూసి భయపడటం కాదు. మీ కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని చూసి నిబంధనలు కొంతమంది పాటిస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దానివల్ల నష్టపోయేది మీరు, మీ కుటుంబ సభ్యులతో పాటు అందరి ప్రాణాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అది అందరు గమనించి నిబంధనలను పాటించాలని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు కోరారు.
No comments:
Post a Comment