గజ్జరం నుండి గోపవరం వెళ్లే రహదారి గోతుల మయం.
తాళ్ళపూడి, పెన్ పవర్
మండలంలో గజ్జరం నుండి గోపవరం వెళ్లే రహదారి గోతుల మయం. వర్షం వచ్చిందంటే ఆ దారిలో ప్రయాణం బహు కష్టం. రోడ్డు మొత్తం బురద మయం. ద్విచక్ర వాహనాలతో ప్రయాణం సర్కస్ పీట్ ను తలపిస్తుంది. బురదలో వాహనాలు జారిపోతూ ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పలుమార్లు ఈ ప్రాంతం వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేపట్టిన సంబంధిత అధికారులు ఏదో మొక్కుబడి చర్యలతో సరిపెట్టేస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి ఎవ్వరు తగిన చర్యలు తీసుకోవడం లేదు. గతంలో కొవ్వూరు మాజీ శాసన సభ్యులు టి.వి.రామారావు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నా నిర్వహించారు. అదే విధంగా గజ్జరం నుండి రాగోలపల్లి వెళ్ళే రహదారి సైతం గతుకుల మయం గా మారింది. వర్షం నీటితో రోడ్డు పై గోతులు నిండిపోయి ద్విచక్ర వాహన దారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఈ దారి గుండా ప్రయాణం చేయడానికి. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, ప్రయాణికులు వర్షాకాలంలో ఇక్కడ జారీ పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాగోలపల్లి, తుపాకుల గూడెం, పోచవరం గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన తాళ్లపూడి రావాలంటే ఇదే దారి. అలాగే గ్రామంలో పనిచేసే టీచర్లు, పంచాయితీ అధికారులు, సొసైటీ బ్యాంకు సిబ్బంది, ఇతర శాఖల అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
No comments:
Post a Comment