అర్హులకు కొత్త ఫింఛన్ల అందచేసిన కేబుల్ మూర్తి
గాజువాక,పెన్ పవర్
-గాజువాక 65 వార్డు సంజీవిగిరి కాలనీ సచివాలయ పరిధిలో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.బీసీ రోడ్డులోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి *బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి)* గారు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కొత్తగా పింఛన్ పొందాలంటే సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఒకప్పుడు ఉండేది అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పని సునాయాసంగా జరుగుతుంది అన్నారు.ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దాల అప్పారావు ,నాగిశెట్టి శ్రీను, ఇరోతి గణేష్, మణికంఠ ,లోకనాధం, మంగునాయుడు ,అడిగర్ల రమణ, ఫణి ,శ్రీను ,అర్జున్ ,అడ్మిన్ గణేష్, శ్రీనివాస్, భార్గవ్ ,భాస్కరరావు, వాలంటీర్స్, తదితరులు పాల్గున్నారు .
No comments:
Post a Comment