పరీక్షలు నాటినుంచే హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటిస్తే శ్రేయస్కరం..
కోవిడ్ కేంద్రాలను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి.
సామర్లకోట, పెన్ పవర్.
కరోనా నిర్ధారణకు గాను చేపడుతున్న కోవిడ్ పరీక్షలు చేయించుకున్న సమయం నుంచి పరీక్షలు చేయించుకున్న వారు హోమ్ క్వారంటైన్ నిబంధనలును పాటిస్తూ ఉంటే తద్వారా వారి గృహాలను కోవిడ్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని అది ఎంతో శ్రేయస్కరం అని జిల్లా డిప్యూటీ కలెక్టర్ సామర్లకోట కోవిడ్ ప్రత్యేకాధికారి ఎస్వీ ఎస్ ఎస్ సుబ్బలక్ష్మి అన్నారు.సామర్లకోట పట్టణం లోని రెండు అర్బన్ సెంటర్ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన కోవిడ్ పరీక్షలను ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్నా,లేకున్నా ఒకసారి పరీక్ష చేయించుకున్న వారు ఇంటికి వెళ్లి హోమ్ క్వారంటైన్ నిబంధనలు పాటిస్తే వారి కుటుంబాలకు ఎంతో మంచ్చిది అన్నారు.ముందుగానే వ్యాధి సోకితే తీసుకునే పోషకాహారం పండ్లు కూరగాయలు మందులు ఏమిటో వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకుని జాగ్రత్తలు వహించాలి అన్నారు.అలాగే గృహంలో మిగిలిన కుటుంబం సబ్యులతో సామాజిక దూరాన్ని పాటించడం,తరచు పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు వహిస్తే పాజిటివ్ వచ్చిన కొద్దీ రోజులలోనే సాధారణ స్థితికి రావడం సాధ్యమవుతుంది అన్నారు.అలా చేస్తూ ప్రభుత్వం అందించే హోమ్ క్వారంటైన్ కిట్టులను ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా స్థానిక తహశీల్దారు వి జితేంద్ర ,మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు ,డి ఇ సి హెచ్ రామారావు లతో పాటు మెడికల్ సిబ్బందికి ఆమె సూచనలు అందించారు.ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ వెంట తహసీల్దార్,కమిషనర్,డి ఇ, అర్బన్ హెల్త్ సెంటర్ ల వైద్యులు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment