"ఈ-కర్షక్ " నమోదు గురించి అవగాహనా సదస్సు
తాళ్ళపూడి, పెన్ పవర్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల పాలిట వరాల జల్లు కురిపించే తరుణంలో రైతులు పండించే పంటకు మద్దతు ధర ఇవ్వడానికి, ఎరువులు, విత్తనాలు, పనిముట్లు, వడ్డీలేని రుణాలు, రైతు భరోసా పధకాలు పొందుటకు కేంద్రబంధువయిన "ఈ-కర్షక్ నమోదు కార్యక్రమం" విజయవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారంనాడు తాళ్ళపూడి మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసులో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం వ్యవసాయ అధికారి జి.మోహన్ రావు నిర్వహించారు. రైతులు ధాన్యం అమ్ముటకు;ఎరువులు, విత్తనాలు పొందుటకు; పంట నష్టం జరిగినపుడు రైతు భరోసా కొరకు;సున్నా వడ్డీ పంట రుణాల కొరకు; వివిధ రకాల పథకాలకు రైతులంతా ఈ-కర్షక్ లో నమోదు చేయించుకోవలసిందిగా చూసించారు. ముఖ్యఅతిథి ఎం.ఆర్.ఒ. ఎం.నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ కర్షక్ నమోదు అనేది జాగ్రత్తగా,నిష్పక్షపాతoగా,పొలానికి వెళ్లి చేయాలని తెలిపారు. కౌలు రైతులకు ఈ-కర్షక్ నమోదులో అవకాశం కల్పించాలని, 100% పంట నమోదు పూర్తిచేయాలని తెలిపారు. ఎ. యస్.ఒ. జె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ-పంట ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని ఏవిధంగా పరిష్కరించాలో తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వి.ఆర్.ఒ. లు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment