విగ్రహ ఆవిష్కరణలో మంత్రి వనిత
తాళ్లపూడి, పెన్ పవర్:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుదవారం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 71 వ పుట్టినరోజు సందర్భంగా పోసిన శ్రీకృష్ణ దేవరాయలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తరువాత కేక్ కట్ చేశారు. మహానేత రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ప్రతి కుటుంబం లబ్ది పొందిందని, ఆరోగ్య ప్రదాత, అపర భగీరధుడుగా పేరొందిన రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచారని , ఆయన బాటలోనే ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రాష్ట్ర లో 30 లక్జల మందికి సొంతింటి కల నెరవేర్చే పెద్ద కార్యక్రమం అతి త్వరలో జరుగుతోందని మత్రి తెలిపారు. అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భం గా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గోపాలపురం మాజీ శాసనసభ్యుడు జొన్నకూటి బాబాజి రావు , కొవ్వూరు సి.ఐ. సురేష్, తాళ్లపూడి ఎస్.ఐ. జి. సతీష్, తహసీల్దార్ ఎం.నరసిహమూర్తి, ఎం.డి.ఒ. ఎం.రాజశేఖర్, ప్రభుత్వ అధికారులు వైసిపి మండల అధ్యక్షులు కుంటముక్కల కేశవ నారాయణ, కొమ్మిరెడ్డి పరశు రామారావు, కొమ్మిరెడ్డి వేంకటేశ్వర రావు, ఎస్.సి.సెల్ అధ్యక్షులు యాళ్ల బాబూరావు, తోట రామకృష్ణ , బండ్రెడ్డి వేంకటేశ్వరరావు , యువజన నాయకులు ఒంబోలు పోసిబాబు, మరియు కార్యకర్తలు, వై.ఎస్. అభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment