బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శాకాంబరి పూజలు..!
సామర్లకోట, పెన్ పవర్:
పంచారామా క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమారా రామ భీమేశ్వరాలయoలో అమ్మవారైన బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శాకాంబరీ మాతా పూజల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాదికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆషాడ మాసంలో భిమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర దినమైన ఆదివారం ఆషాడ మాసంలో వచ్చే ఆఖరి ఆదివారం కావడంతో స్వామివారికి,అమ్మవారికి తెల్లవారుజామున నుంచి పంచామృతాభిషేకాలు,విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని,అమ్మవారిని కూరగాయలతో,పండ్లతో ప్రత్యేక రీతిలో అలంకరించారు.అమ్మవారైన బాలా త్రిపుర సుందరీ అమ్మవారిని మరింత ప్రత్యేక రీతిలో శాకంబరిగా అలంకరించగా భక్తులను ఆ అలంకరణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయంలో ని పెద్ద నంది,ఊయల మండపం,ఇతర ఆలయ పరిసరాల్లో కురాగాయాతో కూడిన ప్రత్యేక అలంకరణలు చేపట్టగా భక్తులు వాటిని ఆశక్తితో తిలకించి ప్రత్యేక రీతిలో అలంకృతులైన స్వామివారు,అమ్మవారలకు ప్రత్యేక పూజలు చెప్పట్టారు.ఈ పూజల్లో ఆలయ పండితులు,సిబ్బంది తో పాటు ఆలయ భక్త సంఘo, అన్నదాన కమిటీ సభ్యులు పాల్గొని సేవలందించారు.
No comments:
Post a Comment