మండపేట లో రికార్డు స్థాయిలో కేసుల నమోదు..
ఎమ్మెల్యే గన్ మెన్ తో సహా కార్ డ్రైవర్ కు పాజిటివ్ ..
ఒక్క రోజే 28 మందికి కరోనా ..
మండపేట, పెన్ పవర్
మండపేట: మండపేట లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గతంలో లేని విధంగా బుధవారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వెలువడిన పరీక్షల ఫలితాల్లో పట్టణంలో మొత్తం 28 మందికి కోవిడ్-19 వైరస్ సోకినట్టు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ నెల 10 న సేకరించిన అనుమానితుల రక్త నమూనాల ఫలితాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గన్ మెన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ కు పాజిటివ్ అని అధికారులు వెల్లడించారు. 28 మందిలో 14 మంది మహిళలు కరోనా బారిన పడ్డారు. వార్డుల వారీగా వచ్చిన బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. 2 వ వార్డులో ఇద్దరు వ్యక్తులకు సచివాలయం 1 లో పని చేసే వలంటీర్ కు రాగా 8 వ వార్డులో ఇద్దరి మహిళలు వైరస్ సోకింది. 9 వ వార్డులో ఒక వ్యక్తికి అలాగే మరో మహిళకు పాజిటివ్ వచ్చింది. 10 వ వార్డు లో ఒకరికి 22 వ వార్డులో మహిళ తో పాటు ఒక వ్యక్తి పాజిటివ్ నిర్ధారణ అయింది. 23 లో ఒక మహిళకు అలాగే 25 వ వార్డులో ఒక వ్యక్తి మహమ్మారి సోకింది. 27 లో ఇద్దరు వ్యక్తులకు కరోనా అని తేలింది. 28 వ వార్డులో 5 గురికి వైరస్ ప్రభావం చూపగా అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. దీంతో పాటు 30 వ వార్డు సంఘం కాలనీలో ఒక మహిళ తో పాటు మరొక వ్యక్తికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. గొల్ల పుంత కాలనీలో ఇద్దరు మహిళలు వైరస్ బారిన పడ్డారు. కాగా ఇదిలా ఉంటే మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిపిన కోవిడ్ - 19 ర్యాపిడ్ టెస్ట్ రిపోర్టు లో కృష్ణా టాకీస్ సమీపంలో ఉన్న పాన్ షాప్ నిర్వాహకుడి కి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అలాగే మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి కూడా ఈ ర్యాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. ఇందులో 35 మంది సిబ్బందికి పరీక్షలు జరపగా వారందరికీ నెగిటివ్ రిపోర్ట్ లు వచ్చాయి. దీంతో మున్సిపల్ అధికారులు , సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని మండపేట లో మొత్తం కేసుల సంఖ్య 70 కి చేరింది. ఇందులో ఒక మహమ్మారి బారిన పడి మృతి చెందిన విషయం విధితమే.
No comments:
Post a Comment