Followers

అక్రమంగా మద్యం రవాణా


 




తెలంగాణ రాష్ట్రం నుండి  ఆంధ్రప్రదేశ్ నకు అక్రమంగా మద్యం రవాణా దారులపై ఉక్కుపాదం మోపుతున్న 


 


జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద అదుపులోనికి తీసుకున్న  పోలీస్ సిబ్బంది


 


 


 


పెన్ పవర్ పశ్చిమ గోదావరిబ్యూరో


 


 


 

 

 

తెలంగాణ రాష్ట్రం నుండి  ఆంధ్రప్రదేశ్ నకు అక్రమంగా మద్యం రవాణా దారులపై ఉక్కుపాదం మోపుతున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె. నారాయణ్ నాయక్, ఐపీఎస్ వారు యొక్క ఆదేశాలపై పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్  జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద 22/23.07.2020 TS 40 UC 9305 అను వాహనంలో తరలిస్తున్న 4,275 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు*

 

 *22/23.07.2020 వ తేదీ  అర్ధరాత్రి సమయంలో పక్క సమాచారము ప్రకారము  స్వయముగా  రంగంలోకి దిగిన ఎస్. ఈ.బి అదనపు ఎస్పి  కరీముల్లా షరీఫ్   తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ లోకి ఒక  వాహనంలో అధిక మొత్తంలో మద్యం బాటిల్స్ తరలిస్తుండగా జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద అదుపులోనికి తీసుకున్న  పోలీస్ సిబ్బంది*

 

 జిల్లా ఎస్పీ కె. నారాయణ్ నాయక్, ఐపీఎస్ వారు  ఆదేశాలపై ఎస్.ఈ.బి అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్  పోలవరం డిఎస్పి ఎం.వెంకటేశ్వరరావు పోలవరం సిఐ.ఏ. ఎన్.ఎన్. మూర్తి  ఆధ్వర్యంలో జీలుగుమీల్లి   ఎస్సై విశ్వనాథము  మరియు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో TS 04 UC 9305 అను  నెంబర్ గల వాహనంలో   మద్యం బాటిల్ లు, 4016 క్వార్టర్   180 ఎం. ఎల్ బాటిల్స్,216  750 ఎం.ఎల్. బాటిల్స్ మరియు 43  1000 ఎం. ఎల్ బాటిల్స్ మొత్తము 4,275 బాటిల్స్ ను అక్రమ  రవాణా చేస్తున్న  స్వాధీనపరచుకొని ముద్దాయిని, వాహనమును మద్యం బాటిళ్లను అదుపులోనికి తీసుకొని  అతని పై ఆంధ్ర ప్రదేశ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ప్రకారము గా కేసు నమోదు పరిచినట్లు, సదరు ముద్దాయిని రిమాండ్ పంపిస్తున్నట్లు, ఈ అక్రమ మద్యం రవాణా కు  మూల సూత్రధారులను గురించి  కూడా  దర్యాప్తు చేసి  వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని, సదరు మద్యం విలువ తెలంగాణలో అయితే 750000 ఆంధ్రప్రదేశ్లో అయితే సుమారు 20 లక్షల రూపాయల ఖరీదు ఉంటాది అని ఈ పత్రికా ప్రకటనలో ఎస్. ఈ.బి అదనపు  ఎస్పీ  కరీముల్లా షరీఫ్   తెలియజేసినారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...