Followers

కేంద్ర నిరంకుశ పాలనను ఖండించాలి


కేంద్ర నిరంకుశ పాలనను ఖండించాలి


చింతపల్లి , పెన్ పవర్


 కేంద్రంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ చర్యలను,రైల్వేల ప్రైవేటికరణను భారత దేశ ప్రజలు ఖండించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. రైల్వేల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం స్థానిక ప్రధాన రహదారిలో ప్లే కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అందులో భాగంగానే లక్షలాదిమంది ఉపాధి పొందుతున్న రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారని అన్నారు. నింగిలో ఎగురుతున్న విమానం దగ్గర్నుంచి జాతీయ రహదారుల వరకు   ప్రైవేటీకరణ చేయబోతున్నారని,కేంద్రం యొక్క నిరసన పాలనను ప్రజలు  అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో   చిరంజీవి  ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...