Followers

మునికోడలి దళిత యువకుడికి శిరోమండనపై నాయ విచారణ చేయాలి


మునికోడలి దళిత యువకుడికి శిరోమండనపై నాయ విచారణ చేయాలి —పిట్టానాగమణి

 

అన్నవరం, పెన్ పవర్ 

 

రాజానగరం నియోజకవర్గం ,సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో లో దళిత యువకులును  పోలీస్ స్టేషన్లో రాత్రంతా అమానుషంగా లాఠీఛార్జ్ చేసి వరప్రసాద్ అనే దళిత యువకుడినిశిరోముండనం  చేయడాన్ని ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ పిట్టా నాగమణి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమే ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ గత రెండు నెలలుగా ఇసుక మాఫియాపై దళిత యువకులు అనేక విషయాల్లో ఇసుక వ్యాపారి కే కృష్ణమూర్తి తో వాదన జరుగుతున్నాయని దీనికి కక్ష పెట్టుకుని  ఇసుక వ్యాపారి పోలీసులను ఉసికల్పి పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు వర ప్రసాద్ ను రాత్రంతా లాఠీఛార్జ్ చేసి శిరోమందనం చేయడాన్ని నాగమణి తప్పుబట్టారు .ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ఆయన అన్నారు .ఈ ఘటనకు కారకులైన ఎస్ ఐ ,కానిస్టేబుళ్లు ,ఇసుక వ్యాపారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని దీనిపై న్యాయ విచారణ కు ప్రభుత్వం  ఆదేశించాలని నాగమణి డిమాండ్ చేశారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...