Followers

ఎదురుకాల్పుల్లో  నలుగురు మావోయిస్టులు హతం


ఎదురుకాల్పుల్లో 
నలుగురు మావోయిస్టులు హతం



ఒడిస్సా ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన ఆంధ్రా పోలీసులు
గాయపడ్డా మావోల కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
ప్రతీకార చర్యకు మావోయిస్టుల ఎదురు చూపు.
నివురు కప్పి న నిప్పుల మన్యం
ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీ లు.


చింతపల్లి /విశాఖపట్నం_బ్యూరో (  పెన్ పవర్)



మన్యం నివురు కప్పిన నిప్పుల మారింది. ఏక్షణంలో ఎటువైపు నుంచి తూటా సౌండ్ వినిపిస్తుందో? పోలీస్ మావోయిస్టు ల మద్య ఏ మారణ హోమానికి తెర తీస్తుందో నన్న భయంతో గిరిజనులు హడలి పోతున్నారు. ఏఓబి లో గత వారం రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. ఒడిస్సాలోని కంధమాల్ జిల్లా,తమిడి బంధ పోలీస్ స్టేషన్ పరిధి సిర్లా అటవీ ప్రాంతంలో గత వారంలో ఒడిసా పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందిన నేపథ్యంలో ఆంధ్రా పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొంతకాలంగా ఏఓబి సరిహద్దు ప్రాంతాలతో పాటు ఒడిస్సా అటవీ ప్రాంతాలలో మావోల కదలికలు ఉదృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో  ఇటు ఆంధ్రాలో అటు ఒడిస్సాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒడిస్సా లో జరిగిన  ఎదురుకాల్పుల్లో మావోలు మృతి చెందడమే కాకుండా మరికొంత మంది మావోలు తీవ్ర గాయాలతో తప్పించుకున్నట్టు ఒడిస్సా పోలీసులు  భావిస్తున్నారు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బతగిలిన నేపథ్యంలో వారు సురక్షిత ప్రాంతమైన  ఏఓబి సరిహద్దు ప్రాంతాలకు తరలి వచ్చే అవకాశం ఉందంటూ పోలీసు నిఘా వర్గాల హెచ్చరికలతో ఏపీ పోలీసులు అప్రమత్త మయ్యారు. దీంతో ఏవోబీ సరిహద్దుల్లో భారీగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఏవోబి పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తమయ్యాయి.  గాలింపు చర్యలు ఉదృతం చేశారు. దీంతో ఏవోబీలో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది. ఏవోబీలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని మన్యం వాసులు భీతిల్లుతున్నారు. పోలీసుల చర్యలతో మావోయిస్టులకు ఎటువంటి నష్టం వాటిల్లినా దాని ప్రభావం ఏఓబి సరిహద్దు గిరిజన గ్రామాలపై పడుతుంది. దీంతో   ఏఓబీ లోని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏవోబీ అటవీ ప్రాంతాన్ని పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అపరిచితులను, అనుమానితులను ప్రశ్నించి విడిచి పెడుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...