డాక్టర్ బిక్కిన పద్మా గోపాలకృష్ణ ప్రముఖ గైన కాల జిస్ట్
.
మండపేట పెన్ పవర్
ప్రజలు ప్రాణాంతక సమస్యలు మినహా చిన్ని చిన్ని ఇబ్బందులకు ఆసుపత్రులకు రావడం మానుకోవాలి. ముఖ్యంగా గర్భిణీలకు ఇమ్యూనిటీ శాతం తక్కువగా ఉంటుంది. బంధువులు, చుట్టుపక్కల వారికి సైతం దూరంగా ఉండాలి. తరుచు ఆసుపత్రులకు వెళ్లడం మానుకోవాలి. 3,5,8నెలల్లో మాత్రమే తప్పని సరిగా స్కానింగ్ నిమిత్తం ఆసుపత్రులకు వెళ్ళాలి. కరోనా సోకిన ఓ వ్యక్తి 12 నుండి 14 మంది వరకూ దానిని అంటించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ కు గురవుతున్న వారు అధికంగా వున్నారు. అటువంటి వారితో సమాజానికి మరింత ప్రమాదకరమని చెప్పుకోవాలి. అన్నింటికంటే ఉత్తమ మార్గం ప్రజలు ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండటమే. అని తెలిపారు.
No comments:
Post a Comment