కందుకూరు లో సంపూర్ణ లాక్ డౌన్
రాకపోకలు పూర్తిగా నిషేధం
వాహనాలు తిరిగితే వాహనాలు సీజ్
పరిమితం చేస్తున్న మెడికల్ షాపులు
పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి
ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్న మని ప్రజలు సహకరించాలని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టిన ప్రజలలో అవగాహన రానందున టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో కొంత ఇబ్బంది ఉన్నా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలు రిమ్స్ లో బెడ్స్ ఖాళీగా లేవని, ప్రైవేట్ హాస్పిటల్స్ లో సైతం బెడ్స్ ఖాళీగా లేవని మహమ్మారి రోజురోజుకు తీవ్రంగా ఉందని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. పట్టణములో రోజురోజుకు కేసులు ఉద్ధృతంగా నమోదవుతున్నాయని అందుకని శుక్రవారం నుండి కందుకూర్ లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని, ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించమని మెడికల్ షాపులు సైతం పరిమిత సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఫోన్ చేస్తే మందులు ఇంటికి చర్చా కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వారం రోజులు బ్యాంకులు సైతం చేస్తామని అన్నారు. పట్టణంలో కేవలం పాస్సింగ్ వెహికల్స్ మాత్రమే అనుమతిస్తామని, చుట్టుపక్కల గ్రామాల వారు వ్యక్తిగతంగా కందుకూరు ఎవరూ రావద్దని ఆయన కోరారు. లాక్ డౌన్ ఎట్టి పరిస్థితిలో ఎటువంటి మినహాయింపులు ఉండవని ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరారు. ఎవరైనా అత్యవసర చికిత్స కోసం మాత్రమే హాస్పిటల్ కి వెళ్లాలని లేనిపక్షంలో బయటకు రావద్దని కోరారు. ఈ నెల 24 నుంచి 30 వరకు ప్రతి ఇంటిని, ప్రతి ప్రాంతాన్ని సంపూర్ణ పారిశుధ్యం చేస్తామని అన్నారు. కందుకూరు ఏరియా వైద్యశాలలో ఇప్పటికే 24 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారని ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. డాక్టర్లు నర్సులకు కూడా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయని ఎంత తీవ్రమైన పరిస్థితులలో వారు పని చేస్తున్నారో అర్థం చేసుకొని వారికి మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాల వారు సహకరించి ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడాలని ఆయన కోరారు. కష్టంగా ఉన్నా తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసం, సమాజం కోసం సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దొంగతనంగా ఎవరైనా షాపులు తీస్తే వాటిని లాక్ చేసే అధికారం సచివాలయాలకు ఇస్తామని హెచ్చరించారు. ఎవరైనా వాహనాలపై తిరిగితే ఆ వాహనాలను లాక్ డౌన్ పూర్తయ్యేవరకూ పోలీసుల ఆధీనంలోనే ఉంటాయని హెచ్చరించారు. మీ యొక్క సంక్షేమం కోసమే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. అనంతరం ఆర్డీవో ఓబులేసు మాట్లాడుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎక్కువ మంది వ్యాధి కి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అన్నారు. మరణాల రేటు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అప్పుడే కరోనా తగ్గుతుందని అన్నారు. అంతేగాని హాస్పిటల్ కి వెళితే కరోనా తగ్గుతుంది అనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే 175 కేసులు పైగా నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడు రోజులు ప్రజలు సంపూర్ణ లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. కూరగాయలు కేవలం 27వ తేదీ మాత్రమే అందుబాటులో ఉంటాయని కావున ప్రజలు కావలసిన సరుకులు, నిత్యావసరాలు ముందుగానే తెచ్చి పెట్టుకోవాలని ఆయన కోరారు. డి.ఎస్.పి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని రోడ్లపై చెక్ పోస్ట్ లు పెడతామని వెహికల్స్ ని ఇక్కడ రికార్డు చేస్తామని ఏ వెహికల్ ఇక్కడ ఆగకుండా చేస్తామని అన్నారు. ఎవరు కూడా సరదా కోసం టౌనుకు రావద్దని కోరారు. కఠినమైన నిర్ణయాలు తోనే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి పాల్గొన్నారు.
No comments:
Post a Comment