నిశబ్దంగా మారిన సామర్లకోట...!విజయవంతమైన కర్ఫ్యూ..
సామర్లకోట, పెన్ పవర్
కరోన వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూ నిర్వహించిన 24 గంటల కర్ఫ్యూ కార్యక్రమం సామర్లకోట పట్టణంలో ఆదివారం విజయవంతమైంది.జిల్లాలోని ప్రధాన జంక్షన్లలో ఒకటైన సామర్లకోట పట్టణంలో ఏ ప్రధాన రహదారి చూసిన,ఏ ప్రధాన కూడళ్లు పరిశీలించినా అంతా నిర్మానుష్యంగా మారి నిశ్శబ్ద వాతావరణమే కనిపించింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మార్గమధ్యంలో ఉన్న వాహనాలు మినహా ఎలాంటి వాహనాల రాకపోకలు లేక ప్రధాన రహదారులు వెలవెల బోయాయి.చిన్న టి బడ్డి మొదలు అతిపెద్ద హోటళ్లు, వ్యాపార కూడళ్లు సయితం మూతపడి పట్టణమంతా ఖాళీగా కనిపించింది. ప్రతీ సెంటర్ కు పోలీస్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో రోడ్లపై అసలు ప్రజలు గాని,వాహనాలు కనిపించలేదు.ప్రభుత్వం ముందుగా చేసిన ప్రకటన తో వ్యాపారస్తులు,ప్రజలు స్వచ్ఛందంగా బయటకు రాకుండా గతంలో విధించిన జనతా కర్ఫ్యూ పూర్తి సహకారాన్ని అందించారు. అలాగే కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన పలు వాహన దారులకు స్థానిక మహిళ ఎస్ ఐ లక్ష్మీకాంతం అపరాధ రుసుములు చెల్లించి కేసులు నమోదు చేశారు.ఈ కర్ఫ్యూకు సంబంధించి పెద్దాపురం సిఐ జయకుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్,ఎస్పీలు కలసి కరోనా వ్యాప్తి చైన్ లింక్ ను తెంచెదుకు ఈ రోజు కర్ఫ్యూ కార్యక్రామానికి పిలుపునుచ్చినట్టు చెప్పారు.మరల ఆదేశాలు వచ్చేంత వరకు ప్రతీ ఆదివారం ఇదే మాదిరిగా 24 గంటల కర్ఫ్యూ కార్యక్రమాలను కొనసాగించనున్నoదున ప్రజలు దీనిని వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు.కేసుల సంఖ్య రోజుకు వెయ్యి దాటుతున్న పరిస్థితుల్లో ప్రతివారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకోవడం ద్వారానే కరోనా వ్యాప్తిని అరికట్టగలము అన్నారు.అలాగే సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వీయ భద్రతతో ఉండాలన్నారు.కాగా ప్రజలు,వ్యాపారులు,ఉద్యోగుల సహాయంతో నిర్వహించిన కర్ఫ్యూ సామర్లకోట లో విజయవంతం కావడం పట్ల పోలీసులు,అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment