తిరుగుడుమెట్ట కంటోన్మెంట్ జోన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు
తాళ్ళపూడి, జూలై 10, పెన్ పవర్:
తాళ్ళపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో హైదరాబాద్ నుండి స్వగృహానికి వచ్చిన వ్యక్తికి కరోన పోసిటివ్ రావడంతో ఆ ఏరియాలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ జోన్లో డాక్టర్ సుష్మా చౌదరి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నప్పుడు వారికి వైద్య పరీక్షలు జరుపుతామని,వారికి కావల్సిన మందులు ఇస్తామని, వైద్యం చేస్తామని తెలిపారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న ఈ మెడికల్ క్యాంపులో మందులు ఇచ్చి వైద్యం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment