సీనియర్ న్యాయవాది సుదీర్ కుమార్ కు పలువురి అభినందనలు.....!
సామర్లకోట, పెన్ పవర్
సామర్లకోట పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్న తాండ్ర సుదీర్ కుమార్ ను పలువురు పట్టణ ప్రముఖులు శనివారం అభినందించారు. ఈయన న్యాయవాధ వృత్తిని ప్రారంభించి నేటికి మూడు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా ఆయనను మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు తో పాటు డి ఇ, సిహెచ్ రామారావు,జిల్లా మానవహక్కుల సంఘo అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా న్యాయవాది సుదీర్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం ఆంద్రా యూనివర్సిటీ లోని డా.అంబెడ్కర్ కాలేజి ఆఫ్ లా లో ఎల్ ఎల్ బి డిగ్రీని పూర్తి చేసుకుని 1990జూలై 17 న తన న్యాయవాధ వృత్తిని ప్రారంభించినట్టు చెప్పారు.అప్పటి నుంచి ఎన్నో కీలకమైన సివిల్ కేసులు ను వాదించి విజయాలను సాధిస్తూ వచ్చానన్నారు.ప్రస్తుతం సామర్లకోట స్టాండింగ్ కౌన్సిల్ గాను పనిచేస్తున్నట్టు చెప్పారు.కాగా మూడు దశాబ్దాలుగా న్యాయ వృత్తిలో కొనసాగుతూ సేవలందిస్తున్న సుధీర్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందించిన వారిలో మానవహక్కుల సంఘo నాయకులు కుంచె నానిబాబు,జుత్తుక అప్పారావు, వల్లీ బాషా తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment