కెమిస్ట్ మల్లేష్‌ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి
ఎంవీవీ సత్యనారాయణ లోకల్ ఎమ్మెల్యే లు మరియు పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరిలోవ హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ మల్లేష్‌ను ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పరామర్శించారు. బుధవారం ఉదయం నేరుగా విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఎంపీలు పినాకిల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న మల్లేష్‌ను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమరనాథ్, నేతలు కేకే రాజు, వంశీకృష్ణ యాదవ్, పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment