చుట్టుముడుతూన్న కరోనా..
రూరల్ పోలీస్ కు పాజిటివ్...
ధైర్యం విడక... సాహసం గా విధులు నిర్వహణ...
మండపేట, పెన్ పవర్
అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా కరోనా చుట్టుముట్టుతుంది. అందులో 24 కోవిడ్ విధుల్లో తలమునకలై ఉంటున్న పోలీస్ లు సైతం కరోనా కాటుకు బలవుతున్నారు.
అయిన ధైర్యం విడక సాహసం గా విధులు నిర్వహిస్తున్నారు. మండపేట రూరల్ ఎస్ ఐ పీతల దొరరాజు లాక్ డౌన్ సమయంలో అనారోగ్యం కు గురయ్యారు. చికెన్ ఫాక్స్ సోకడం తో ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి. మరో వైపు లాక్ డౌన్ సమయం. ఉన్నత అధికారులు మరి కొన్ని రోజులు సెలవు తీసుకోవాలని సూచించారు. అయినా ఎస్ ఐ దొరరాజు వీధుల్లో చేరిపోయారు. అనునిత్యం గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఈ నేపద్యంలో సాక్షాత్తు రూరల్ పోలిస్ స్టేషన్ కు కరోనా సెగ తాకింది. స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆతనికి ఈ నెల 5 న జ్వరం గా ఉండటంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కాగా శాంపిళ్ళు కాకినాడ వెళ్లడం తో పలితాలు ఆలస్యం అయ్యాయి. జ్వరం తగ్గకుండా ఉండటం తో ఎస్ ఐ చొరవ తో ద్వార పూడి పి హెచ్ సి లో శుక్రవారం తిరిగి పరీక్షలు నిర్వహించి రాజమహేంద్రవరం పంపారు. కాగా శనివారం అతనికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో స్టేషన్ లో కలకలం ఏర్పడింది. మరో కానిస్టేబుల్ కు పరీక్షలు చేయగా అతనికి నెగిటివ్ వచ్చింది. శనివారం పోలిస్ సిబ్బంది తో బాటు రూరల్ సి ఐ మంగాదేవి, ఎస్ ఐ దొరరాజు లు సైతం పరీక్షలు చేయించుకోగా పలితాలు రావాల్సి ఉంది. కాగా పాజిటివ్ వచ్చిన కానిస్టేబుల్ మండపేట మండలం తాపేశ్వరం లోని శివాలయం వీధి సమీపంలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. తాపేశ్వరం పంచాయతీ కార్యదర్శి శుభకర్ అక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. కానిస్టేబుల్ బావమరిది పది రోజులు క్రితం తాపేశ్వరం వచ్చి నట్టు సమాచారం. కాగా ఈ విపత్కర పరిస్థితుల్లో సైతం పోలీసులు తమ విధులను సవాల్ గా స్వీకరించారు.
No comments:
Post a Comment