Followers

ఆత్రేయపురం మండలం లో నేటి నుండి కొత్త నిబంధనలు

ఆత్రేయపురం మండలం లో  నేటి  నుండి కొత్త నిబంధనలు


పెన్ పవర్, ఆత్రేయపురం


ఆత్రేయపురం మండలం లో కరోనా వ్యాప్తి దృష్ట్యా అమలాపురం ఆర్డీవో గారి ఆదేశాల మేరకు లో జూలై 14 వ తేదీ నుండి మండలం అంతటా అన్ని షాపులు, మార్కెట్లు, వీధి వ్యాపారులు,,లిక్కర్ షాపులు కూడా ఉదయం 6.00 గంటల నుండి 11.00 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని‌ ఆత్రేయపురం ఎంపీడీఓ నాతి బుజ్జి, ఎస్సై నరేష్, డిప్యూటీ తాహశిల్దార్ మాధురి సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అన్ని షాపుల లోను మాస్క్ లు తప్పనిసరిగా ధరించే అమ్మకాలు జరగాలని  తెలిపారు. పాలు,పాల ఉత్పత్తులుకు సంబంధించిన డైరీ ఫారాలు కూడా ఉదయం 6.00 గంటల నుండి 11.00 గంటల వరకు మాత్రమే విక్రయించాలని ఆదేశించారు.  కేవలం అత్యవసర వైద్య సేవలు అందించే మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రం 24 గంటలు పనిచేస్తాయని  తెలిపారు.  చేపలు, మాంసం విక్రయించే మార్కెట్లు ఆదివారం మూసివేయడం జరుగుతుందని  పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు,బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్(ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లు వంటివి) రోజూ మాదిరిగానే పని చేస్తాయని అయితే తక్కువ సిబ్బంది తో అన్ని ముందు జాగ్రత్తలు అనగా మాస్క్ లు ధరించడం,సామాజిక దూరం పాటిస్తూ పనిచేయాలని  ఆర్.డి. ఓ తెలిపారన్నారు.  వివాహ సంబంధమైన కార్యక్రమాలకు పది మంది వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందని, వీటికి అవసరమైన అనుమతులు ఆర్.డి. ఓ, లేదా  మండల తహశీల్దార్ నుండి పొందాలని  తెలియ చేశారు. పది మంది దాటి ఫంక్షన్ కు ఎక్కువ మంది హాజరైతే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారుమండలం లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికైనా ప్రజలు కరోనా ప్రమాద స్థితిని గుర్తించి జాగర్త పడవలసిందిగా  విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే తప్ప ప్రక్క ఇళ్ల కు కూడా వెళ్ళే సాహసం చేయవద్దని  సూచించారు. అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే చుట్టూ ప్రక్కల కరోనా పాజిటివ్ కేసులు వున్నాయని గుర్తించి స్వీయ రక్షణా పద్దతులు పాటించాలని  సూచించారు. అన్ని గ్రామాల్లో ఈ నిబంధనలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు,మహిళా పోలీసులు మరియు మరియు వాలంటీర్లకు ఆదేశాలిచ్చారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...