నూతన ప్రజాస్వామ్యం కోసం పోరాడాలి
చింతపల్లి పెన్ పవర్
దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను భేషరతుగా తక్షణమే విడుదల చేయాలి, రాజ్యం(రాష్ట్రం) ప్రదర్శిస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి, త్వరలో స్థానిక (స్తానో) సంస్థల ఎన్నికలను బహిష్కరించండి అంటూ ఆదివాసీ విప్లవ ఐక్య సంఘటన తూర్పు, విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్ పేరిట సోమవారం చింతపల్లి ప్రెస్ క్లబ్ కు చిరునామా లేని ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో మావోయిస్టు పార్టీ నాయకత్వంపై తప్పుడు పోస్టర్లను ముద్రించి గిరిజన వ్యతిరేకులుగా ప్రచారం చేయడాన్ని ఆదివాసీ నాయకులు, విద్యార్థులు, మేధావులు తిప్పికొట్టాలి. ఇప్పటికీ మావోయిస్టు పార్టీ ఉద్యమం ఉంది గనుక ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, సంపద నిలకడగా ఉంది. మావోయిస్టు పార్టీ లేకపోతే నేడు ఆదివాసీలు, ఆదివాసీ ప్రాంతాలు ఎడారులుగా ఉండేవి. మావోయిస్టు పార్టీలో పనిచేసే ఉద్యమకారులు నిస్వార్ధపరులు. వారి జీవితాలను త్యాగం చేసేవారేనని ఆదివాసీలు గుర్తించాలి. నేడు ఆదివాసీ ప్రాంతాలలో పర్యాటకం (టూరిజం) పేరుతో విదేశీ సంస్కృతి పరిఢవిల్లుతుంది.గిరిజన నాయకులుగా చలామణి అవుతున్న వారే పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.దీనిని ఆదివాసీలు వ్యతిరేకించాలి. రాజకీయ ఖద్దరు ముసుగులో ఉన్న గిరిజన రాజకీయ నాయకులు ఖద్దరు ముసుగు నుండి బయటకు వచ్చి నూతన ప్రజాస్వామ్యం కోసం పోరాడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత పాలన నుండి వైదొలగాలని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకత తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఖైదీల పై ఒకదాని పై మరో కేసు నమోదు చేయడం తాము తీవ్ర వ్యతిరేక చర్యగా భావిస్తున్నాం. ఒక ఖైదీ సంవత్సరాల తరబడి జైలులో ఉంటే శిక్షా కాలం కంటే ఎక్కువ సమయం కేసుల విచారణకు పడుతుంది. ఈ సందర్భాన్ని ఆదివాసీ మేధావులు, విద్యార్థులు, నాయకులు గమనించి రాజకీయ ఖైదీల పక్షాన నిలబడాలి. జల్, జంగల్, జమీన్ ల పై హక్కుల కోసం యువత సాయుధ పోరులో నిలవాలని కోరుతన్నామంటూ ఆదివాసి విప్లవ ఐక్య సంఘటన తూర్పు, విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment