గుట్కాలను స్వాధీన
వ్యక్తి పై కేసు నమోదు
తాళ్ళపూడి, పెన్ పవర్:
ఆదివారం తాళ్లపూడి గ్రామంలో గుట్కాలు, ఖైనీలు అమ్ము వ్యక్తుల ఇల్లు, షాపులు రైడ్ చేశామని యస్.ఐ. జి.సతీష్ తెలిపారు. వారికి రాబడిన సమాచారం మేరకు ఉప్పాల శ్రీనివాసు ఇంటి వద్ద తమ సిబ్బందితో రైడ్ చేయగా ప్రభుత్వంచే నిషేధించబడిన, 1957 ప్యాకెట్లు ఖైని మరియు గుట్కాలను స్వాధీన పరుచుకొని, సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను, ఖైనీలను అమ్మవద్దని తెలిపారు. దీనివలన ప్రజల ఆరోగ్యo చెడిపోతుందని తెలిపారు.అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
No comments:
Post a Comment