Followers

బి జే పీ  ఆధ్వర్యంలో ఘనంగా గురుపౌర్ణమి 


బి జే పీ  ఆధ్వర్యంలో ఘనంగా గురుపౌర్ణమి 


 


పూర్ణా మార్కెట్ ,పెన్ పవర్.

 

భారతీయ జనతా పార్టీ విశాఖ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి సూచన మేరకు గురుపౌర్ణమి పర్వదినాన గురువుని సత్కరించు కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బిజెపి దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ అయినటువంటి  కొప్పల.రామ్ కుమార్ ఆధ్వర్యంలో జ్ఞానపురానికి చెందిన బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు అయినటువంటి వంక సంజీవ రావు  అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందిన బేతా. రాణి వారిని ఈరోజు సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం రాణి  ప్రధాని  నరేంద్ర మోడీ గారి సుపరిపాలన విధానాన్ని చూసి తాను ఎంతో ఆకర్షితురాలిని అయ్యానని అందువలన భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఉజ్వల భవిష్యత్తు కొరకు విశాఖ నగరంలో కృషిచేస్తానని పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి , మోహన్ రావు , యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి విశ్వతేజ , దళిత మోర్చా నాయకులు చక్రవర్తి , రాంబాబు , స్థానిక బిజెపి నాయకులు సతీష్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...