వరద ఉదృత ప్రవాహం కేశవరం గండి ప్రమాదకరం
మండపేట, పెన్ పవర్
మండపేట మండలం కేశవరం గ్రామం లోని గనిపోతురాజు చెర్వు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి వేగంలోనే ద్విచక్ర వాహనాలు రాక పోకలు సాగిస్తూన్నాయి. ప్రతి ఏటా వర్షం సీజన్ లో ఈ చెర్వు లో ఎగువ మెట్ట ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు వస్తూ ఉంటుంది. సుమారు 115 ఎకరాల విస్తీర్ణంలో ఈ గనిపోతురాజు చెర్వు ఉంది. సాధారణ సమయాల్లో నీరు తక్కువగా ఉంటుంది. ఎండాకాలం లో ఎండి పోతుంది. ఇక వర్షాలు కురిస్తే పొంగి ప్రవహిస్తోంది. కేశవరం బొమ్మూరు ప్రధాన రహదారి పై ఈ చెర్వు నుండి వెళ్లే వరద నీరు కోసం కాజ్ వే ఉంది. దీన్ని స్థానికులు చెర్వు గండి అంటారు. ఈ గండి నుండి పై ఉన్న పంట పొలాల్లో నుండి ధవళేశ్వరం సామర్లకోట ప్రధాన కాల్వలోకి ఈ నీరు వెళ్తాయి. కాగా గత ఏడాది కంటే ఎక్కువగా ఈ సారి ప్రవాహం వస్తుంది. కాగా మోటర్ సైకిళ్ళు సగం పైగా మునిగి పోతున్నాయి. చాలా వాహనాలు సైలెన్సర్ లో నీరు చేరి మరమ్మతులకు గురి అవుతున్నాయి. అలాగే మహిళలతో కలిసి వెళ్లే వారు అక్కడ జారీ పడుతున్నారు. ఇక కొందరు యువకులు ప్రమాదం అని తెలిసినా అక్కడే సెల్ఫీ లు,వీడియో లు తీసుకుంటున్నారు.
No comments:
Post a Comment