మండలంలో లాక్ డౌన్ విధించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టండి.
.... సనాతన ప్రబోధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తోట. సాయిబాబా.
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండలంలో గత రెండు వారాలుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఎక్కడ లాక్‌డౌన్ నిబంధనలను పాటించుట లేదు. ప్రధాన రహదారి గుండా గుంపులుగుంపులుగా జనాలు సంచరిస్తున్నారు ఏ దుకాణం వద్ద చూసిన అనేక మంది జనం గుమికూడి ఉంటున్నారు. మాస్కులు ధరించడం లేదు సామాజిక దూరాన్ని అసలేమాత్రము పాటించుట లేదు. దీని ఫలితంగా గోకవరం పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాధి వ్యాప్తి అనేది విస్తృతంగా జరుగుతున్నది కావున ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి దుర్భర దుస్థితిలో నుండి గోకవరం మండలప్రజానీకాన్ని సంరక్షించుటకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గోకవరం మండలంలో 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించి తద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆయన ఉన్నతాధికారులకు నివేదించారు .
No comments:
Post a Comment