Followers

ఆ భవనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి

 



ఆ భవనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి


గూడెం కోత్త వీధి పెన్ పవర్


గూడెం కోత్త వీధి మండలంలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలు పై ప్రస్తుతప్రభుత్వం దృష్టి సారించక పోవడంతో చాలా భవనాలు నిరూపయోగంగా దర్శనం ఇస్తున్నాయి. గూడెం కోత్త వీధి మండలం అభివృద్ధి పైజీల్లా అధికార యంత్రాంగం సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని గిరిజనులు నుండి విమర్సలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమం అమలు పరుస్తున్నా నాడు ప్రభుత్వం నిర్మించిన భవనాలు నేడు ప్రభుత్వం పట్టించుకోదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2018-2019. సంవత్సరంలో మండల కేంద్రంలో కంపోస్టు యార్టు భవనం నిర్మించింది. అప్పటిలో ఈ యార్టు భవనం నిర్మాణం కొరకు సుమారు 5లక్షలు రూపాయులు ఖర్చుచేసినట్లు సమాచారం. యార్టు నిర్మాణం పనులు చేపట్టిన సదరు కాంట్రాక్టర్లు భవనం అసంపూర్తిగా నిర్మాంచి పూర్తి స్థాయిలో బిల్స్ తీసుకుని వదలివేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న కంపొస్టు యార్టు భవనంలో ఉద్యోగుల కార్లు గూడెం కోత్త వీధి పంచాయతీ కి చేందిన ట్రాక్టర్ ద్విచక్ర వాహనాలు పెట్టుకోవడానికి  వినియోగిస్తున్నారు. గూడెం కోత్త వీధి మండలం లో వివిధ శాఖలు ప్రభుత్వం కార్యాలయలు వున్నప్పటికీ సిబ్బంది సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి భవనాలు లేక సిబ్బంది అంగన్వాడీ. అశా వార్కర్లు. వైద్య సిబ్బంది. గ్రామ సచివాలయం సిబ్బంది పడుతున్నా బాధలు వర్ణనాతీతం.  ప్రస్తుతం కంపోస్టు యార్టుభవనం ఏవిధంగా వినియోగపడకపోవడంతో,  కనీసం మండల స్థాయిలో జరిగే సమీక్షా సమావేశాలకు ఉపయోగపడేవిదంగా ఈ భవనాన్ని  తీర్చి దిద్దాలని గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న పలుశాఖల అదికారులు ఉద్యోగులు స్థానిక ప్రజలు  కోరుతున్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...