ఆశా వర్కర్లు అందరూ కలిసి ఆర్థిక సహాయం
వి.ఆర్.పురం పెన్ పవర్:
వి ఆర్.పురం మండలం బి.సి.కాలనీ గ్రామంలో నివసిస్తున్న సవలం రాంబాబు గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతడు భార్య పేరు అనిత యస్.సి. కాలనీ లో ఆశా వర్కర్ గా పనిచేస్తుంది. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఇది గమనించిన రేఖపల్లి పి.హెచ్.సి. కి సంబంధిచిన ఆశా వర్కర్లు తోటి వర్కర్ భర్తకు చేయూతనిచ్చి ఆర్ధిక సహాయం చేయాలని మానవతా దృక్పథంతో వారు కష్టపడిన నగదులోనుంచి ఆ కుటుంబానికి కొంత నగదును తొమ్మిదివేల రెండువందల రూపాయలు ఆర్ధిక సహాయం చేసినారు. మేము ఉన్నామని ఆ కుటుంబానికి భరోషా ఇచ్చినారు. జీడిగుప్ప పి.హెచ్.సి. కి సంబంధించిన డా. సుందర ప్రసాద్ ఆ కుటుంబానికి రెండువేల రూపాయల నగదును ఆర్ధిక సాయం చేసినారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎన్.ఎం. లు సూపర్ వైజర్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
No comments:
Post a Comment