Followers

ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు లో ఎదురుకాల్పులు



ంధ్రా ఒడిస్సా సరిహద్దు లో ఎదురుకాల్పులు

మావోయిస్టు మృతి

చింతపల్లి , పెన్ పవర్

ఆంధ్రా ఒడిస్సా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు బలగాలకు, మావోయిస్టులకు శనివారం సాయంత్రం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఒడిస్సా రాష్ట్రం, మల్కన్ గిరి జిల్లా, చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధి, విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం,గజ్జెడు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల సంఘటనలో జి.మాడుగుల మండలం, వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి పేతురు అలియాస్ దయ (23) మృతిచెందాడు. ఈ ఎదురుకాల్పుల సంఘటనలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్ కె), ఉదయ్, అరుణ, జగన్ లు తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన మావోయిస్టు పేతురు అలియాస్ దయ  రామ్ గూడ లో పోలీసులకు మావోయిస్టులకు 2016 లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలో మృతి చెందిన మావోయిస్టు దొసో తమ్ముడు ఈ దయ. అన్న చనిపోవడంతో తమ్ముడు ఉద్యమంలో చేరాడు. సంఘటనా స్థలంలో పోలీసులు 303 తుపాకీ, 3 కిట్ బ్యాగులు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతదేహాన్ని బలపం, కోరుకొండ అటవీ ప్రాంతం మీదుగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం పోలీసులు  మన్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఏ ఓ బి లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


 

                                                                                             

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...