Followers

కోరలు చాస్తున్న కరోనా రక్కసి:ఎస్సై ఫిరోజ్ షా


కోరలు చాస్తున్న కరోనా రక్కసి:ఎస్సై ఫిరోజ్ షా



పెన్ పవర్, సీతానగరం: 



 కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా అడ్డూ అదుపు లేకుండా భయంకరంగా విజృంభిస్తుందని ఎస్సై ఫిరోజ్ షా విలేఖర్లకు తెలియజేశారు. మండలంలో కరోనా కేసులు 12కు పైగా చేరడంతో ప్రైమరీ కాంట్రాక్టులు బయట తిరగడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు విధిగా ధరించాలని అత్యవసరమైతే తప్ప  ఎవ్వరూ బయటకు రావద్దని ఎస్సై మండల ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ ఎక్కడ నుంచి ఎక్కడికి పోతుందో అని మండల అధికారులు భయపడుతుంటే ప్రజలు అధికారులకు సహకరించకుండా ఉండటం,పలు గ్రామాల్లో ప్రజలు విచ్చలవిడిగా తిరగడం సరికాదన్నారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరిగే కొందరికి సీతానగరం సెంటర్ నందు పలువురి ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే చట్టరీత్యా చలానా కట్టించడం జరుగుతుందని ఎస్ ఐ  ఎస్.కె ఫిరోజ్ షా మండల ప్రజలకు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...