కాకినాడ పి.ఆర్.కళాశాలకు మరో అరుదైన గుర్తింపు..
ప్రిన్సిపల్ డాక్టర్..చప్పిడి కృష్ణ.
కాకినాడ స్టాఫ్ రిపోర్టర్,పెన్ పవర్
నూటముప్పై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాకినాడ పిఠాపురం రాజా కళాశాలకు మరో అరుదైన గుర్తింపు లభించింది. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గుర్తింపును ఇస్తూ కళాశాల కమీషనర్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో "న్యాక్ " కి వెళ్లే సందర్భం లో ఈ గుర్తింపు ద్వారా మంచి గ్రేడ్ సాధనకు ఉపరిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. చప్పిడి. కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
దీని ద్వారా అదనపు గదుల నిర్మాణం, గదుల మరమ్మత్తులు, ల్యాబుల సౌకర్యం,జాతీయ స్థాయిలో సిబ్బందికి శిక్షణా
కార్యక్రమాలు, ఆర్థిక వనరులు అందే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకులు, జాతీయ స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించగల గొప్ప అవకాశం అందుతుందని
తెలిపారు. కళాశాలలో ఇప్పటికే ఉన్న ముప్పైకి పైగా ఉన్నా కోర్సుల తో పాటు కొత్తగా మరో మూడు యుజి ,ఒక పీజీ కోర్సు కి కూడా అనుమతి లభించిందని, బీఎస్సీ విభాగంలో ఐ.ఒ.టి,బి.ఏ విభాగంలో ఆఫీస్ మెనజిమెంట్,బి. ఎం.ఎస్.ఏ, పీజీలో ఎంపీసీ బొటనీ కోర్సు కి అనుమతి లభించింది. అలాగే క్యాంపస్ ఎంపిక ల ద్వారా కళాశాల విద్యార్థులకు
ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరుకుతాయని, గతంలో ఎన్నో కార్యక్రమాలు ద్వారా గుర్తింపు పొందిన ఈ కళాశాల ,మరో మైలు రాయిని చేరడం పట్ల కళాశాల సిబ్బంది,విద్యార్థులు,పూర్వ విద్యార్థులు,కాకినాడ నగర వసులు
సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ గుర్తింపు ద్వారా మేము మరింత ఉత్సాహంగా పని చేస్తూ, కళాశాలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించగలమని ప్రిన్సిపాల్ గారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్
డాక్టర్.చప్పిడి కృష్ణ తో పాటు,
వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. వి. శ్రీనివాసన్, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్.హరి రాం ప్రసాద్,పరీక్షల విభాగం అధికారి,డాక్టర్.ఎన్. శ్రీనివాస్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని కళాశాల కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
No comments:
Post a Comment