Followers

విత్తనాలు పురుగు మందుల దుకాణాల పై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు



పరవాడ మండలం లోని 
విత్తనాలు పురుగు మందుల దుకాణాల పై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు
కాలం చెల్లిన పురుగు మందులను అమ్ముతున్న షాపు సీజ్



 పరవాడ పెన్ పవర్ 



పరవాడ : కాలం చెల్లిన పురుగుమందులను విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు పరవాడ సినిమా హాలు జంక్షన్లో ఉన్న శ్రీలక్ష్మి రైతు డిపో పై శుక్రవారం ఉదయం దాడులు చేసి సీజ్ చేశారు.రు"3,30,000 విలువైన కాలం చెల్లిన పురుగుల మందులను గుర్తించిన విజిలెన్స్ అధికారులు పురుగు మందు దుకాణాన్ని సీజ్ చేశారు.ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారు లతో పాటు మండల వ్యవసాయ అధికారి చంద్రావతి కూడా పాల్గొన్నారు. అయితే సీజ్ చేసిన 24 గంటల్లోనే ఆ పురుగులు దుకాణం తెరుచుకోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. శుక్రవారం సీజ్ చేసిన దుకాణం శనివారం యధావిధిగా తెరుచుకోవడంతో అధికారుల పనితీరు పై స్థానికులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.దుకాణం తెరుచుకునే విషయంలో భారీగా సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో కాలం చెల్లిన పురుగుమందులను విక్రయిస్తూ రైతులను మోసం చేసిన వ్యాపారి పై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పై ఆరోపణలు వినిపిస్తున్నాయి.విజిలెన్స్ అధికారులు దాడులు చేసేంతవరకు మండల వ్యవసాయ అధికారి ఏమి చేస్తున్నారు అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.ఎప్పటికప్పుడు పురుగుల మందుల దుకాణాల పై పర్యవేక్షణ చేయాల్సిన అధికారి క్షేత్ర స్థాయిలో విధులు సరిగ్గా నిర్వహించక పోవడం వల్లనే పురుగుల మందు దుకాణాదారులు కాలం చెల్లిన పురుగుమందులను రైతులకు అంటగడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏకంగా మూడు లక్షల 30 వేల రూపాయల విలువైన కాలం చెల్లిన మందులు శ్రీ లక్ష్మీ రైతు డిపో దుకాణంలో ఉంటే మండల వ్యవసాయ అధికారి విజిలెన్స్ అధికారులు దాడులు చేసేంతవరకు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాలం చెల్లిన  పురుగుల మందులను వాడే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు విజిలెన్స్ అధికారులు దాడులు చేసి సీజ్ చేసిన దుకాణం సైతం తెరుచుకోవడం వెనక వ్యవసాయ అధికారి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయాన్ని మండల వ్యవసాయ అధికారి చంద్రావతి దృష్టికి తీసుకువెళ్లగా శ్రీ లక్ష్మీ రైతు డిపో పురుగుల మందు దుకాణాన్ని సీజ్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ ఆ దుకానాన్ని తెరవడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, తెరిచిన విషయం మాకు తెలియదని చెప్పడం కొసమెరుపు. అంటే మండల వ్యవసాయ అధికారి విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే ఈ విషయం ఆమె మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాలం చెల్లిన పురుగుల మందు దుకాణాలపై పర్యవేక్షణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...