ఏలేశ్వరం జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ అజీం జానీ హఠాన్మరణం
ఏలేశ్వరం
స్థానిక జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ అజీమ్ జానీ(70) బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. స్థానిక దిబ్బల పాలెంలో నివాసముంటున్న ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృదుస్వభావి అజీం జానీ హఠాన్మరణం పట్ల గ్రామ పెద్దలు, ముస్లిం పెద్దలు, యువకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పట్టణంలో పలువురు నాయకులు, ముస్లింలు తరలివచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వెలుబుచ్చారు.
No comments:
Post a Comment