Followers

స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు తిలక్, ఆజాద్ లు


 


స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు తిలక్, ఆజాద్ లు: వై కా పా నాయకులు రఘు రామ్


 


జగ్గంపేట,   పెన్ పవర్ 


 


:బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ 


 స్వరాజ్యం నా జన్మహక్కు  అని బ్రిటీష్ వారిని ఎదిరించిన నాయకుడు  బాలగంగాదర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్   లు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులనీ వై కా పా నాయకులు వొ మ్మి రఘు రాం అన్నారు. బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాల గంగా దర్ తిలక్ 1856. జులై 23న మహరాష్ట్రలోని రత్నగిరిలో  జన్మించారు.1920 అగస్టు 1న ఆయన మరణించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన నాయకులను బావితరాల వారి గురించి,వారి స్ఫూర్తిని తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది దేశఃకోసం ప్రాణాలర్పించిన వారిని గుర్తుచేసుకు౦టూ వారికివే మా జోహార్లు . అలాగే  చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) (జూలై 23, 1906 – ఫిబ్రవరి 27, 1931) భారతీయ ఉద్యమకారుడు. భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా , అష్ఫాకుల్లా ఖాన్ ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరు.  ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకుని ఆత్మార్పణం చేసుకొని భారత జాతీయ ఉద్యమంలో  అజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ వారికివే మా జోహార్లు అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...