చాగల్లు మండలంలో మంత్రి తానేటి వనిత రోడ్ శంఖుస్థాపన
తాళ్ళపూడి, పెన్ పవర్:
చాగల్లు మండలంలో మార్టేరు టూ ప్రక్కిలంక రహదారి అని పిలువబడే రోడ్ కు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శంఖుస్థాపన శుక్రవారం చేశారు. ఈ రోడ్ కు దాదాపు 24 కోట్ల రూపాయల సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు మంజూరు కావడం జరిగింది అని తెలిపారు. ఈ రోడ్ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, ఫండ్స్ తీసుకొచ్చిన సెంట్రల్ మినిస్టర్ కృష్ణ దాస్ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి, వనిత ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్ చాలా పాడైపోయింది అని, ఈ రోడ్ మీద నుంచి నడవడానికి పాదచారులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. నేను ఎక్కువగా ఈ రోడ్ మీద నుండే ప్రయాణం చేస్తుంటానని, ప్రయాణికులు ఇబ్బందులు చూస్తూ ఉంటానని వనిత చెప్పారు.రైతులు వ్యవసాయo కొరకు దమ్ముకు ఉపయోగించే ట్రాక్టర్ వీల్స్ ఈ రోడ్ గుండా తీసుకెళ్లితే దాని వలన రోడ్ పాడవుతుంది అని, ఇది గవర్నమెంట్ ది అనుకోవడం సరికాదని, గవర్నమెంట్ అంటే మనమేనని, మనం కట్టిన పన్నులు అభివృద్ధి కార్యక్రమాలుకు ఖర్చుచేస్తారని, ఈ రోడ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమందరికి ఉందని తెలిపారు. కరోన విజృoబిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు తుంపరలు ఎదుటి వ్యక్తులు మీద పడతాయని, ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు, దీని వలన ఎదుటివారి కి అటాక్ అవ్వొచ్చని తెలిపారు. అందరూ కరోన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment