Followers

మండపేట మండలం లో శనివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు  


మండపేట మండలం లో శనివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు


 
మండపేట, పెన్ పవర్


మండలం లో శనివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కాగా మరొకరు ద్వారపూడి వార్డు వాలంటీర్. దీంతో ఆయా కార్యాలయ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారి నివసించే ఇంటివద్దా, కార్యాలయాల వద్దా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ప్రమాదం ఎటు నుండి వస్తుందో అర్ధం కాకుండా ఉందని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఇల్లాల్లోనే వుంటూ ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగవద్దని ఆయన సూచించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...