కోవిడ్ పై ఆందోళన వద్దు
మంత్రి విశ్వరూప్
అమలాపురం పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్
దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కరోనా వైరస్ తీవ్రం ఉన్నప్పటికీ ప్రజలెవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి అన్నారు. శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో పది శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని,దీని నియంత్రణకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించవలసిన అవసరం వుందని మంత్రి తెలిపారు. అమలాపురం డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు 22,521 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 1,495 పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని, 21,026 కేసులు నెగిటివ్ రావడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.పాజిటివ్ కేసుల్లో 956 మందిని ఐసోలేషన్ సెంటర్స్ కు తరలించగా 525 మందిని హోమ్ ఐసోలేషన్ లో వుంచడం జరిగిందని మంత్రి తెలిపారు. మిగిలిన యాక్టివ్ కేసులు కిమ్స్ లోను, బొమ్మూరు లోను చికిత్స తీసుకుంటున్నారని మంత్రి తెలియ చేశారు.1091 మందిని చికిత్స అనంతరం నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
డివిజన్ లో గత మార్చి నుండి ఇప్పటివరకు కోవిడ్ మరణాలు 14 సంభవించాయని మంత్రి తెలిపారు.అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో 30 వార్డులు వుండగా అందులో 24 వార్డులు కంటైన్మెంట్ జోన్ లు గా గుర్తించడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.
అమలాపురం లో విద్యుత్ దహన వాటిక(ఎలక్ట్రిక్ క్రీమేషన్ )ఏర్పాటు___మంత్రి
అమలాపురం లో విద్యుత్ దహన వాటిక (ఎలక్ట్రిక్ క్రీ మేషన్ )ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు డివిజన్ లో 14 కోవిడ్ మరణాలు సంభవించాయని, రాబోయే రోజుల్లో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉన్నందున దహన సంస్కారాలుకు ఇబ్బంది లేకుండా వుండేందుకు అమలాపురం మునిసిపాలిటీ లో విద్యుత్ దహన వాటిక (ఎలక్ట్రిక్ క్రీమేషను )ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలియచేశారు.
కోవిడ్ మరణాలపట్ల వివక్షత వద్దు______మంత్రి
కోవిడ్ కారణంగా మరణించిన వారి పట్ల ప్రజలెవరూ అమాననీయ కోణం లో చూడకూడదని,అలాగే వారిపట్ల వివక్షత చూపకూడదని మంత్రి హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారు ఒక్కొక్కరికి దహన సంస్కారాలు నిమిత్తం 15 వేలు మంజూరు చేశారని, అమలాపురం డివిజన్ లో కోవిడ్ కారణంగా మరణించిన 14 మందికి ఒక్కొక్కరికి 15 వేలు రూపాయలు చొప్పున రేపు సాయంత్రంలోగా ఆర్.డి. ఓ ద్వారా అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే కోవిడ్ కారణంగా మరణించిన వారిని అనాధ శవాలుగా భావించకుండా వారికి ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు చేయాలని మంత్రి సూచించారు. పాత్రికేయుల సమావేశంలో అమలాపురం ఆర్.డి. ఓ ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, డిఎస్పీ షేక్ మాసుం భాషా పాల్గొన్నారు.
కోవిడ్_19 పై అధికారుల తో మంత్రి సమీక్ష
అమలాపురం డివిజన్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసిన చర్యల పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంభందిత శాఖల అధికారులు తో సమీక్షించారు. అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం లో మంత్రి మాట్లాడుతూ మునిసిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుధ్యానికి చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్.రాజును మంత్రి ఆదేశించారు. అన్ని వార్డుల్లో ను సోడియం హైపో క్లోరైడ్ ను ఉదయం,సాయంత్రం కూడా స్ప్రే చేయాలని మంత్రి సూచించారు.అలాగే డివిజన్ లోని అన్ని మండలాలలోను మెరుగైన పారిశుధ్యం వుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో అమలాపురం ఆర్.డి. ఓ ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, డిఎస్పీ షేక్ మసూం భాషా, మునిసిపల్ కమీషనర్ కె.వి.వి.ఆర్.రాజు, అమలాపురం,అల్లవరం మండలాల తహసీల్దార్ లు మాధవరావు,అప్పారావు, అల్లవరం ఎం.పి.డి. ఓ సుగుణ శ్రీ కుమారి, ఏ.డి.ఎం.అండ్.హెచ్. ఓ డా. పుష్కర రావు, పంచాయిత్ రాజ్ డిప్యూటీ ఇ ఇ లు రాంబాబు,మురళీ కృష్ణ, కే.ఆర్.సి.తహసీల్దార్ లక్ష్మీపతి, అమలాపురం మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు చెల్లు బోయిన శ్రీనివాస్, మట్ట పర్తి నాగేంద్ర, దంగేటి రాంబాబు, మోటూరి సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment