Followers

ఎక్సైజ్ అధికారులు దాడులు ముగ్గురిపై కేసు నమోదు


ఎక్సైజ్ అధికారులు దాడులు ముగ్గురు వ్యక్తులుపై కేసు నమోదు


పోలవరం పెన్ పవర్


ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆదేశాల మేరకు గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో దాడులు నిర్వహించినట్లు పోలవరం ఎక్సైజ్ సీఐ జి సత్యనారాయణ అన్నారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీ సిద్ధంగా ఉన్న 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేస్తామన్నారు. బుచ్చియ్య పాలెం గ్రామానికి చెందిన పులిబోయిన పోసి బాబు, పులిబోయిన శ్రీను, భీమోలు గ్రామానికి చెందిన గంటా మురళి కృష్ణ అను ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. అక్రమ ధనార్ధనకు  అలవాటుపడిన కొందరు నాటు సారా తయారీ, అమ్మకాలకు అలవాటు పడ్డారని అన్నారు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ దాడుల్లో సి ఐ జి సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ రాజా, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...