Followers

రొంగలి వరాహ ఉగ్రనరసింహా రావుకు  బి.జె.పి నాయకుల దిగ్భ్రాంతి


రొంగలి వరాహ ఉగ్రనరసింహా రావుకు  బి.జె.పి నాయకుల దిగ్భ్రాంతి


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


 

 

బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, అర్.టీ.ఓ   ఏజెంట్స్  అసోసియేషన్ అధ్యక్షులు రొంగలి వరాహ ఉగ్రనరసింహా రావు ఆకస్మిక మరణం పట్ల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు , మాజీ  ఎమ్మెల్సీ  పి వి చలపతి రావు  దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఉగ్రనరసింహా రావు తండ్రి అయిన వెంకట జగన్నాథ రావు  తన అనుచరునిగా ఉంటూ  ఎమర్జెన్సీ సమయంలో ఒక సైనికునిలా పని చేసారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా  ఏం.ఎల్.సి  పి.వి.యన్. మాధవ్  మాట్లాడుతూ నరసింహారావు గారు ఒకవైపు అర్ టీ ఓ   ఏజెంట్స్   అసోసియేషన్ అధ్యక్షులు గా బాధ్యతలను నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తగా ఎనలేని సేవలు అందించారని అన్నారు. మాజీ ఎం.ఎల్.ఎ. విష్ణు కుమార్ రాజు  మాట్లాడుతూ నరసింహ రావు భార్య ఈ మధ్యనే కన్నుమూశారని, ఇంతలోనే ఈయన కూడా మరణించడం అతని కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఏం. రవీంద్ర మాట్లాడుతూ నరసింహారావుకి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు ఉన్నారని ,వారి పెద్దకుమార్తె  కనకమహాలక్ష్మి, బీజేపీ విశాఖపట్నం మహిళా మోర్చాలో కూడా పని చేసారని తెలిపారు. ఆయన యొక్క కుమారుడు అయిన జి.బివి. రవి కుమార్ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ  49 వ వార్డు కార్యదర్శిగా కూడా పార్టీలో సేవలందిస్తున్నారని, నరసింహారావు  కుటుంబం మొత్తం భారతీయ జనతా పార్టీకి అంకితహభావంతో పనిచేస్తున్నారని , అతని కుటుంబ సబ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ  స్వర్గీయ ఉగ్రనరసింహా రావు  ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...