టెలికాం అధికారులు తక్షణమే స్పందించాలి
గూడెం కొత్తవీధీ, పెన్ పవర్
మండలంలో సప్పర్ల గ్రామంలో ఉన్న. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నుండి సెల్ సేవలు సక్రమంగా అందించే విధంగా బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తమ గ్రామంలో సేల్ టవర్ వున్నప్పటికీ సిగ్నల్స్ వ్యవస్థ సక్రమంగా వుండడం లేదని తాము ఫోన్ చేసుకోవాలన్న చివరకు అధికారులకు ఎటువంటి సమాచారం అందించాలన్న మాగ్రామానికి 20. కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడెంకొత్తవిది గానీ దారకొండ గ్రామాలకు వెళ్లి సెల్ టవర్ పైఆదారపడవలసివస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిగ్నల్స్ వ్యవస్థ మెరుగు పరిచి సెల్ సేవలు మెరుగు పరచడానికి టెలికాం అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కొరుతున్నారు
No comments:
Post a Comment