కార్మికుల "ఘోష" పట్టించుకోండి
పూర్ణమార్కెట్, పెన్ పవర్
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కరోనాలో కూడా నిరంతరంగా పరిశుద్య
పనులు చేస్తూ....కరోనా సమయంలో కూడా తమ ఆరోగ్యాలను పక్కన పెట్టి రోగులకోసం... పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు గత 3 నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు, వారిని పట్టించుకునే నాధుడే కరువవ్వడం తో శుక్రవారం కార్మికులు ఘోష ఆసుపత్రి ఆవరణంలో నే విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, మార్చి 2020, నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ఈ మూడు నెలలు అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని ...
పైగా కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న సమయంలో ఎవరు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, దీంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
No comments:
Post a Comment