ముందు జాగ్రత్త కోసం కరోనా టెస్ట్లు.
వి ఆర్ పురం పెన్ పవర్.
వి ఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో గలాపి హెచ్ సి వైద్యశాలలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయుచున్న సిబందికి ముందు జాగ్రతకోసం కరోనా టెస్ట్లు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించినారు.శుక్రవారం కరోనా టెస్ట్లు 14 మందికి నిర్వహించామని డాక్టర్ సుందర్ ప్రసాద్ తెలిపారు.ఈ విషయం పై మండల తహశీల్దార్ ఎన్ శ్రీధర్ ను వివరణ కోరగా వి ఆర్ పురం మండలంలో కరోనా మహమ్మారి కరణం గా ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ముందు జాగ్రత్తకోసం మండల ప్రజలు కరోనా టెస్ట్లు చేయించుకోవాలి.మనిషి మనిషికి దూరం పాటించాలి,ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలి,లేనియెడల 50 రూపాయలు జరినామా విధించబడును.ద్విచక్ర వాహనంపై ఒక్కరే ప్రయాణించాలి,ఇద్దరు ముగ్గురు ప్రయాణించినచో షిజ్ చేయబడును.ఆటోలు,మేజిక్ లు పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించిన ఎడల,అలాంటి వాహనాల ను షీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరుగుతుంది. కిరాణా షాపులు మరియు ఇతర షాపులు ఉదయం 6 గంటలనుండి 11 గంటల వరకే తెరిసి ఉంచాలి, అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవాహరించిన వారిపై కేసులు నమోదం చేయబడును.ప్రతి కిరాణా సేపు యొద్ద సైనటీజర్ ,సబ్బు నీళ్లు సిద్ధంగా ఉంచ్చలి.మా పై అధికారుల ఉత్తర్వులు మేరకు మండల ప్రజలకు తెలియజేయటం జరిగింది. ఈకార్యక్రమంలో మండల యం పి డి ఓ శ్రీనివాసరావు, డాక్టర్ నాగార్జున, వి ఆర్ పురం ఎస్సై వెంకట్ పోలీస్ సిబ్బంది ,రివెన్యూ కార్యాలయ సిబ్బంది,యం డి ఓ కార్యాలయ సిబ్బంది,ఏ ఎన్ యం లు మండల ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment