ఉపాధి కూలీలతో బీజేపీ సమావేశం
అనకాపల్లి పెన్ పవర్
తగరంపూడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఎన్ అప్పారావు, మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు , భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి శ్రీనివాసరావు, కప్పెర తాతారావు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కూలీ రేటు ఇరవై రూపాయలు పెంచి 202 రూపాయలు చేయడమైనది అన్నారు. అదేవిధంగా రాబోయే మూడు నెలలు ఉచితంగా అర్హులైన అందరికీ రేషన్ ఇవ్వటము అవుతుందని వచ్చే నెలలో కిషాన్ సమ్మోహన నిధి కింద రెండు వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేయడం అవుతుందని చెప్పారు . ఒక సంవత్సర కాలంలో మోడీగారి సాధించిన విజయాల్ని చేసిన కార్యక్రమాల యొక్క ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన నిధుల వివరాలను కరపత్రాల పంపిణీ చేశారు.
No comments:
Post a Comment